బాంబు దాడి కేసులో నిర్దోషిగా తేలిన వ్యక్తి...తనను సోషల్ మీడియాలో తిట్టిన వారిపై దావా
- September 24, 2022
కువైట్: ఆత్మాహుతి దాడి కేసులో నిర్దోషిగా తేలిన ఓ వ్యక్తి...తనను నిందితుడంటూ సోషల్ మీడియాలో తిట్టిన వారందరినీ కోర్టుకు లాగాడు. తనకు ఆ బాంబు దాడితో ఎలాంటి సంబంధం లేకపోయిన దాదాపు 4 వేల మంది ట్విట్టర్ లో తనను అసభ్యంగా తిట్టారంటూ వారందరిపై దావా వేశాడు. వివరాల్లోకి వెళితే 2015 లో కువైట్‌లోని షియా మసీదుపై ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఈ దాడిలో 27 మంది చనిపోయారు. ఐతే టెర్రరిస్టులు వాడిన కారు యాజమాని అంటూ పోలీసులు ఓ వ్యక్తి అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేయటంతో కోర్టు లో విచారణ జరిగింది. ఉగ్రదాడికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి కి ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిన కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. కానీ చాలా మంది ట్విట్టర్ లో అతన్ని తిడుతూ కామెంట్లు చేశారు. దీంతో ఆ వ్యక్తి ట్విట్టర్ లో తిట్టిన 4 వేల మందిపై దావా వేశారు. వాళ్లందరినీ గ్రూపులు, గ్రూపులుగా విచారించాలని కోర్టును కోరాడు. వారి ఫోన్ నంబర్లను కూడా న్యాయస్థానానికి అందజేశాడు. దీంతో ఈ ఘటన కువైట్ లో సంచలనంగా మారింది. ఐతే కోర్టు ఈ దావాను విచారిస్తుందో లేదా వేచి చూడాలి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







