సమంత అమెరికా వెళ్లింది ఎందుకో తెలిసిపోయిందిగా.!
- September 24, 2022
సమంతకు ఏదో అనారోగ్యంతో బాధపడుతోందనీ, గతంలో ఆమె ఫేస్ చేసిన అరుదైన స్కిన్ ఎలర్జీ ఆమెను ఈ మధ్య మళ్లీ వేధిస్తుందనీ అందుకే, సమంత సందడి సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించడం లేదంటూ, ఈ మధ్య పుకార్లు షికార్లు చేశాయ్.
అలాంటిదేం లేదంటూ సమంత మేనేజర్ క్లారిటీ ఇచ్చినా ఈ పుకార్లు ఆగనే లేదు. లేటెస్టుగా సమంత అమెరికా యానం కట్టిందనీ, అందుకు కారణం కూడా ఆమె అనారోగ్యమే అంటూ ఆ పుకార్లు నెక్స్ట్ లెవల్‌కి చేరాయి.
అయితే, అసలు విషయం తేలిపోయింది. సమంత అమెరికా ప్రయాణం కట్టడానికి కారణమేంటా.? అని కూపీ దారులు కూసింత గట్టిగానే కూపీ లాగేశారు.
సమంత సినిమాలో పాటూ, కొన్ని వెబ్ సిరీస్ ప్రాజెక్టులతోనూ బిజీగా వున్న సంగతి తెలిసిందే. అందులో కీలకమైన వెబ్ సిరీస్‌ని ‘ఫ్యామిలీ మేన్’ మేకర్లు రూపొందిస్తున్నారు. ప్రముఖ అమెరికన్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’కి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. లీడ్ రోల్ మాత్రం సమంతదే.
సమంతతో ‘ఫ్యామిలీ మేన్ 2’ రూపొందించిన రాజ్ డీకే ఈ సిరీస్‌నీ రూపొందిస్తున్నాడు. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ వెబ్ సిరీస్ కోసమే సమంత అమెరికా వెళ్లిందట. కొన్ని యాక్షన్ సీన్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోబోతోందట అమెరికాలో సమంత. అద్గదీ అసలు సంగతి.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







