జర్మనీలో మరిన్ని పెట్టుబడులు పెడతాం-ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ తానీ
- September 26, 2022
దోహా : వాణిజ్య, ఆర్థిక రంగాల్లో మరింత మెరుగైన సంబంధాల కోసం జర్మనీ, ఖతార్ లు పరస్పరం కలిసి పనిచేస్తాయని ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ చెప్పారు. ఆదివారం జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తో ఆయన దోహాలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక, విద్య, క్రీడలు, సాంస్కృతి రంగాల్లో సహకారం, ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను చర్చించారు. అనంతరం రెండు దేశాల అధినేతలు సంయుక్త ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఖతార్ రాజు షేర్ తమీమ్ మాట్లాడుతూ జర్మనీతో తమకు మంచి అనుబంధం ఉందన్నారు. భవిష్యత్ లో పలు రంగాల్లో పరస్పర సహకారం కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు. ముఖ్యంగా ఇంధన రంగంలో ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నందున అందుకు అనుగుణంగా ఎనర్జీ రంగంలో ఖతార్, జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెడుతాయన్నారు. జర్మనీలో అతి పెద్ద విదేశీ పెట్టుబడిదారు ఖతారే అని అన్నారు.
జర్మనీ జట్టుకు శుభాకాంక్షలు
అటు ఈ ఏడాది ఫిపా పుట్ బాల్ వరల్డ్ కప్ ఖతార్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్ ఆడేందుకు ఖతార్ రానున్న జర్మనీ టీమ్ కు ఖతార్ రాజు శుభాకాంక్షలు తెలిపారు. జర్మనీ ఫుట్ బాల్ ఫ్యాన్స్ కు కూడా స్వాగతం పలికారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య కొనసాగుతున్న వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సి అవసరముందని సమావేశంలో ఇరు దేశాల అధినేతలు అభిప్రాయపడ్డారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య వార్ కు చర్చల ద్వారా ముగింపు పలకాలన్నారు. ఇరాన్ అణు ప్రయత్నాలు, లిబియాలో పరిణామాలు, అఫ్ఘనిస్తాన్ లో పరిస్థితిపై కూడా చర్చించారు. ఖతార్ తో మరింత మెరుగైన సంబంధాలకు తన పర్యటన దోహదం చేస్తుందని భావిస్తున్నానని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ అన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







