ఒమన్ లో ఘనంగా సౌదీ నేషన్ డే సెలబ్రేషన్స్

- September 26, 2022 , by Maagulf
ఒమన్ లో ఘనంగా సౌదీ నేషన్ డే సెలబ్రేషన్స్

మస్కట్ : సౌదీ నేషన్ డే ను ఒమన్ లో ఘనంగా నిర్వహించారు.  ఈ నెల 23 సౌదీ 92 వ నేషన్ డే జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మస్కట్ లోని సౌదీ రాయబార కార్యాలయం ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఒమన్ లోని సీనియర్ అధికారులు, విదేశీ వ్యవహారాల అధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఒమన్, సౌదీ మధ్య సోదర సంబంధాలున్నాయన్నారు. కార్యక్రమం అనంతరం అతిథులకు విందు ఏర్పాటు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com