‘వాట్సాప్’కు మాల్వేర్ ముప్పు.. నివారణకు ఇలా చేయండి
- September 26, 2022రియాద్: సౌదీ అరేబియాలోని వాట్సాప్ అప్లికేషన్ వినియోగదారులకు తీవ్రమైన మాల్వేర్ ముప్పు ఉందని, నివారణకు యాప్‌ను అప్డేట్ చేసుకోవాలని సైబర్ నిపుణులు సూచించారు. నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీకి అనుబంధంగా ఉన్న నేషనల్ సైబర్ సెక్యూరిటీ గైడెన్స్ సెంటర్, మెటా ప్లాట్‌ఫారమ్‌ల యాజమాన్యంలోని మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ కు సంబంధించి హై-సెక్యూరిటీ హెచ్చరికను జారీ చేసింది. హ్యాకర్లు మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌ను రిమోట్‌గా పంపుతారని, దీని కారణంగా ప్రోగ్రామ్ అకస్మాత్తుగా షట్ డౌన్ అవుతుందన్నారు. మాల్వేర్ ముప్పు నివారణకు తక్షణమే వాట్సాప్ వెర్షన్లను అధికారిక స్టోర్ల నుండి అప్డేట్ చేయాలని సూచించారు. మరింత సమాచారం కోసం https://www.whatsapp.com/security/advisories/2022 లింకును క్లిక్ చేసి తెలుసుకోవాలన్నారు.
అప్డేట్ రిలీజైన వాట్సాప్ వెర్షన్లు ఇవే..
• WhatsApp – Android: ప్రీ వెర్షన్ 2.22.16.12; ప్రీ వెర్షన్ 2.22.16.2
• WhatsApp బిజినెస్ – Android: - ప్రీ వెర్షన్ 2.22.16.12; ప్రీ వెర్షన్ 2.22.16.12
• WhatsApp - iOS: ప్రీ వెర్షన్ 2.22.16.12; ప్రీ వెర్షన్ 2.22.15.9
• WhatsApp వ్యాపారం – iOS: - ప్రీ వెర్షన్ 2.22.16.12
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు