అనూ ఇమ్మాన్యుయేల్: అప్పటి ‘ప్రేమ కాదంట’.. మారిపోయిందంట.‘
- September 26, 2022
మలయాళ ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్ మళ్లీ వస్తోంది. అదేనండీ, అప్పుడెప్పుడో ‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ముద్దుగుమ్మ గుర్తుంది కదా. ఆమెనే అనూ ఇమ్మాన్యుయేల్. చాలా తక్కువ టైమ్‌లోనే ఏకంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి టాలీవుడ్ స్టార్స్‌నే చక్కబెట్టేసింది.
అయినా అనుకున్న డెస్టినేషన్‌ని రీచ్ అవ్వలేకపోయింది. స్టార్ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకుంటే, ఆ హీరోయిన్లను స్టార్ హీరోయిన్ల లిస్టులో వేస్తారు. కానీ, అదేంటో, అనూ ఇమ్మాన్యుయేల్‌ని అదృష్టం మరోలా వుంది. స్ర్కీన్ స్పేస్ వరకే చెల్లింది కానీ, ఆ పై మాటను మాత్రం అందుకోలేకపోయింది.
పోతే పోయింది.. కానీ, అనూ లక్ చాలా విచిత్రమైనదనే చెప్పాలి. ఫ్లాప్ వస్తే చాలు, ఇక ఆ హీరోయిన్లు మాయమైపోతుంటారు. కానీ, అనూ ఇమ్మాన్యుయేల్‌కి అవకాశాలు వస్తూ, పోతూనే వున్నాయ్ కానీ, ఎందుకో నిలదొక్కుకోలేకపోతోంది టాలీవుడ్‌లో.
ఇప్పుడు మళ్లీ వస్తోంది ఈ ముద్దుగుమ్మ. బన్నీతో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బన్నీ సోదరుడు అల్లు శిరీష్ సినిమా ద్వారా మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. అన్నట్లు ఈ సినిమాకి అప్పుడెప్పుడో ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఆ టైటిల్‌ని మార్చేసి ‘ఊర్వశివో రాక్షసివో’ అనే టైటిల్ పెడుతున్నట్లుగా మేకర్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







