‘వాట్సాప్’కు మాల్వేర్ ముప్పు.. నివారణకు ఇలా చేయండి

- September 26, 2022 , by Maagulf
‘వాట్సాప్’కు మాల్వేర్ ముప్పు.. నివారణకు ఇలా చేయండి

రియాద్: సౌదీ అరేబియాలోని వాట్సాప్ అప్లికేషన్ వినియోగదారులకు తీవ్రమైన మాల్వేర్ ముప్పు ఉందని, నివారణకు యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సైబర్ నిపుణులు సూచించారు. నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీకి అనుబంధంగా ఉన్న నేషనల్ సైబర్ సెక్యూరిటీ గైడెన్స్ సెంటర్, మెటా ప్లాట్‌ఫారమ్‌ల యాజమాన్యంలోని మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్‌ కు సంబంధించి హై-సెక్యూరిటీ హెచ్చరికను జారీ చేసింది. హ్యాకర్లు మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌ను రిమోట్‌గా పంపుతారని, దీని కారణంగా ప్రోగ్రామ్ అకస్మాత్తుగా షట్ డౌన్ అవుతుందన్నారు. మాల్వేర్ ముప్పు నివారణకు తక్షణమే వాట్సాప్ వెర్షన్‌లను అధికారిక స్టోర్‌ల నుండి  అప్‌డేట్ చేయాలని సూచించారు. మరింత సమాచారం కోసం https://www.whatsapp.com/security/advisories/2022 లింకును క్లిక్ చేసి తెలుసుకోవాలన్నారు.

అప్డేట్ రిలీజైన వాట్సాప్ వెర్షన్లు ఇవే..

• WhatsApp – Android: ప్రీ వెర్షన్ 2.22.16.12; ప్రీ వెర్షన్ 2.22.16.2

• WhatsApp బిజినెస్ – Android: - ప్రీ వెర్షన్ 2.22.16.12; ప్రీ వెర్షన్ 2.22.16.12

• WhatsApp - iOS: ప్రీ వెర్షన్ 2.22.16.12; ప్రీ వెర్షన్ 2.22.15.9

• WhatsApp వ్యాపారం – iOS: - ప్రీ వెర్షన్ 2.22.16.12

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com