ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
- September 27, 2022
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్ )లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 1535 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత, కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాల విషయానికి వస్తే ట్రేడ్ అప్రెంటిస్,అటెండెంట్ ఆపరేటర్ 396, ట్రేడ్ అప్రెంటీస్ (ఫిట్టర్) 161, ట్రేడ్ అప్రెంటీస్ (బాయిలర్) 54, టెక్నీషియన్ అప్రెంటిస్ కెమికల్ 332, టెక్నీషియన్ అప్రెంటిస్ మెకానికల్ 163, టెక్నీషియన్ అప్రెంటిస్ మెకానికల్ 198, టెక్నీషియన్ అప్రెంటిస్ 198,సెక్రటేరియల్ అసిస్టెంట్ 39, ట్రేడ్ అప్రెంటీస్- అకౌంటెంట్ 45, ట్రేడ్ అప్రెంటీస్- డేటా ఎంట్రీ ఆపరేటర్ 41 ట్రేడ్ అప్రెంటీస్- డేటా ఎంట్రీ ఆపరేటర్ (స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్స్) 32 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టులను అనుసరించి డిగ్రీ, డిప్లొమా, క్లాస్ 12 విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 23ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://WWW. iocl.com పరిశీలించగలరు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







