బాలీవుడ్‌ సీనియర్‌ నటి ఆశా పరేఖ్‌ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు

- September 27, 2022 , by Maagulf
బాలీవుడ్‌ సీనియర్‌ నటి ఆశా పరేఖ్‌ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు

ముంబై: బాలీవుడ్‌ సీనియర్‌ నటి ఆశా పరేఖ్‌ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుకు ఎంపికైనట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మంగళవారం ప్రకటించారు. 2020 ఏడాదికి సంబంధించి ఈ అవార్డుకు పరేఖ్‌ ఎంపికయ్యారు. 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగా ఈ నెల 30న ఫాల్కే అవార్డును పరేఖ్‌ స్వీకరించనున్నారు.
పదేళ్ల వయసుకే చిత్ర సీమలో అడుగుపెట్టిన ఆశా పరేఖ్‌ 1942 అక్టోబర్‌ 3న గుజరాతీ కుటుంబంలో జన్మించారు. బాల్యంలోనే శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నారు. 1959లో విడుదలైన దిల్‌ దేకే దేఖో చిత్రంలో ఆమె హీరోయిన్‌గా మారారు. కతీ పతంగ్‌, మేరా గావ్‌ మేరా దేశ్‌, తీర్సీ మంజిల్‌ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com