జీతాల ఫాలో-అప్‌కు 'అస్-హల్ ' ప్లాట్‌ఫారమ్‌

- September 28, 2022 , by Maagulf
జీతాల ఫాలో-అప్‌కు \'అస్-హల్ \' ప్లాట్‌ఫారమ్‌

కువైట్: వ్యాపారవేత్తలను సాధారణ తేదీకి ఏడు రోజుల ముందుగానే జీతాలు చెల్లించాలని పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ (PAM) కోరింది. అక్టోబరులో 'అస్-హల్’ ప్లాట్‌ఫారమ్‌లో జీతాల ఫాలో-అప్ విధానాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. కొత్త విధానం అప్డేట్ చేసేందుకు వీలుగా యజమానులు జీతాలను ముందుగానే బదిలీ చేయాలని కోరింది. వ్యాపార యజమానులు జీతాల చెల్లింపులకు, ఆలస్యమైన క్రెడిట్‌లు లేదా జీతం కోతలకు గల కారణాలను కూడా తెలిపేందుకు వ్యాపార యజమానులకు కొత్త ప్లాట్ ఫారమ్ ఉపయోగపడుతుందని మాన్‌పవర్ ప్రొటెక్షన్ అథారిటీ వైస్ మేనేజర్ డాక్టర్ ఫహద్ అల్-మురాద్ అన్నారు. ఆదేశాలు పాటించని యజమానులపై చర్యలు ఉంటాయని, కొత్త కార్మికులను నియమించడానికి అనుమతించబడదని ఆయన హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com