మహేష్ కోసం త్రివిక్రమ్ ఆ తప్పు చేస్తాడా.?
- September 28, 2022
క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకోవడంలో త్రివిక్రమ్‌ది సెపరేట్ పంథా. ఆయా పాత్రల కోసం ఆయన ఎంచుకునే నటీనటులు, వాళ్లకు వచ్చిన గుర్తింపు వేరే లెవల్. అయితే, ఈ సారి మాత్రం త్రివిక్రముడి అంచనాల్ని అభిమానులు తప్పు పడుతున్నారు.
మహేష్ బాబుతో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా కోసం ఈ సారి ఓ సీనియర్ నటుడ్ని రంగంలోకి దించాలనుకుంటున్నాడట మాటల మాంత్రికుడు. ఆయన సెలెక్షన్‌పై మహేష్ అభిమానులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట.
అదేంటీ.? త్రివిక్రమ్ సెలెక్షన్నే తప్పు పట్టేలా, ఆ సీనియర్ నటుడు ఎవరై వుంటారబ్బా.? అనుకుంటున్నారా.? ఇంకెవరు మంచు మోహన్ బాబు. ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం మోహన్‌బాబుతో త్రివిక్రమ్ సంప్రదింపులు చేస్తున్నట్లు కాస్త ఉప్పందింది.
దాంతో, అభిమానులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో ప్రచారానికి దిగారు. మోహన్ బాబు వద్దంటే వద్దు బాబోయ్ అంటూ రచ్చకు దిగారట. మరి, అభిమానుల్ని కాదంటే ఆ రిజల్ట్ ఎలా వుంటుందో ఊహించలేనంత అమాయకుడు కాదు త్రివిక్రమ్. నిజంగానే మోహన్‌బాబు ఆలోచన చేస్తున్నాడా.? లేక, జస్ట్ రిఫరెన్స్ కోసం పొగ రాజేశాడా.? అనేది తెలియాలంటే, ఇంకాస్త టైమ్ వెయిట్ చేయాల్సిందే.
ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసేసి, నెక్స్ట్ షెడ్యూల్ కోసం వచ్చే నెలలో ముహూర్తం ఫిక్స్ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అన్నట్లు ఈ సినిమాలో పూజా హెగ్దే, మహేష్‌కి జోడీగా నటిస్తోంది.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం