మెగా రికమెండేషన్: ‘గాడ్ ఫాదర్’ కోసం సత్యదేవ్
- September 28, 2022
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో యంగ్ స్టర్ సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కీలకం అంటే, సినిమాకి మెయిన్ లీడ్ విలన్ రోల్ అది. హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సత్యదేవ్‌ని ఏకంగా మెగాస్టార్‌కి విలన్‌గా చూడడమా.? అంటే, ఈ పాత్రకు సత్యదేవ్‌ని రికమెండ్ చేసింది స్వయానా మెగాస్టార్ చిరంజీవేనట.
స్వయంగా ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. మలయాళ మూవీ ‘లూసిఫర్’కి రీమేక్‌గా రూపొందుతోన్న సినిమా ఇది. ఒరిజినల్లో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా.? అని ఆలోచిస్తున్న డైరెక్టర్ మోహన్ రాజాకి, సత్యదేవ్ అయితే బాగుంటాడనీ, ఆయన బాడీ లాంగ్వేజ్, ఒడ్డూ, పొడవూ క్యారెక్టర్ డెప్త్కి చక్కగా సూటవుతాయనీ చిరంజీవి చెప్పారట.
చాలా ఇంటెన్స్‌తో నటించి, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడనీ, ఎంపిక చేసినందుకు ఖచ్చితంగా తన పేరు నిలబెడతాడనీ సత్యదేవ్‌పై చిరంజీవి నమ్మకం వ్యక్తం చేశారు.
సత్యదేవ్‌కి చిరంజీవి అంటే ప్రత్యేకమైన అభిమానం. ఓ అభిమానిగా తాను ఆయనకు ప్రేమను మాత్రమే పంచగలను. కానీ, ఆయన నాకు జీవితంలో ఓ మైలురాయినే ఇచ్చారు.. అంటూ గాడ్ ఫాదర్ ఛాన్స్‌పై సత్యదేవ్ ఎమోషనల్ అయ్యారు. తన ఎమోషన్ని ట్వీట్ రూపంలో ఎక్స్‌ప్రెస్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా చిరంజీవికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు సత్యదేవ్. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







