నటిగా అప్పుడే తనకు సంతృప్తి అంటోన్న రష్మిక మండన్నా.!
- September 29, 2022
తెరపై కనిపించే తన పాత్రకు తన గొంతు మాత్రమే వినిపిస్తేనే బాగుంటుందని చెబుతోంది రష్మిక మండన్నా. నేషనల్ క్రష్‌గా రష్మికకు విపరీతమైన ఫాలోయింగ్ వుంది. ఆ ఫాలోయింగ్తోనే తెలుగుతో పాటూ, తమిళ, హిందీ భాషల్లోనూ రష్మిక క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటోంది.
తెలుగులో ‘పుష్ప 2’ సినిమాలో రష్మిక నటిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళంలో ఇళయ దళపతి విజయ్ సరసన ‘వారసుడు’ సినిమాలో నటిస్తోంది రష్మిక. బైలింగ్వల్ మూవీగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది ఈ సినిమా.
హిందీలోనూ రష్మిక చేతిలో మూడు పూర్తయిపోయిన ప్రాజెక్టులుండగా, మరో రెండు చర్చల దశలో వున్నాయ్. బిగ్‌బి అమితాబ్ కీలక పాత్ర పోషించిన రష్మిక మూవీ ‘గుడ్ బై’ త్వరలో రిలీజ్‌కి రెడీగా వుంది.
కాగా, ప్రస్తుతం రష్మిక ఖాళీ దొరికినప్పుడల్లా, హిందీ నేర్చుకుంటోందట. అందుకోసం ప్రత్యేకంగా ట్యూషన్ పెట్టించుకుందట. అలాగే తమిళంలోనూ పట్టు సాధిస్తానంటోంది. ఇకపై తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానంటోంది. ఆల్రెడీ తెలుగులో తన పాత్రకు రష్మిక సొంతంగానే చెప్పుకుంటుంది. ఇకపై తమిళ, హిందీ భాషల్లోనూ రష్మిక సొంత డబ్బింగ్‌కే ప్రిఫరెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని చెబుతోంది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం