అవివాహిత మహిళల అబార్షన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- September 29, 2022
న్యూ ఢిల్లీ: అబార్షన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పెళ్లి కాకుండా గర్భం దాల్చినా అబార్షన్ చేయించుకునే హక్కు ఉంది అంటూ అత్యంత సంచలన తీర్పునిచ్చింది. పెళ్లి కాలేదనే కారణంతో అబార్షన్ చేయించుకునే హక్కు లేదని సరికాదని వారికి ఆ హక్కు ఉందని స్పష్టంచేస్తూ సంచలన తీర్పునిచ్చింది. గర్భాన్ని తొలగించుకోవాలని అనుకునే మహిళలు వివాహితులై ఉండాల్సిన నియమం ఏమీ లేదని మణిపూర్‌కు చెందిన ఓ మహిళ దాఖలు చేసిన కేసు విచారించిన సందర్భంగా సుప్రీం ఈ తీర్పునిచ్చింది. చట్ట ప్రకారం సురక్షితమైన అబార్షన్ చేసుకోవచ్చని..MTP చట్టం ప్రకారం పెళ్లికాని మహిళలు అబార్షన్ చేసుకునే హక్కు ఉంది వెల్లడించింది. అబార్షన్ చట్టం ప్రకారం వివాహితులు, అవివాహిత స్త్రీలకు తేడా లేదని..గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ చేసుకోవచ్చని తీర్పుని వెల్లడించింది. అబార్షన్ చేయించుకోవాలని మహిళలు నిర్ణయించుకుంటే వారికి ఎవరి అనుమతి పొందాల్సి అవసరం లేదని తెలిపింది.
భార్యకు ఇష్టం లేకపోయినా..భర్త బలవంతంగా శృంగారం చేయడం వల్ల గర్భం వస్తే..దాన్ని తొలగించుకునే హక్కు భార్యకు ఉందని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ముఖ్యంగా అత్యాచార ఘటనలోనూ అబార్షన్ చేయించుకోవటం తప్పుకాదని అది నేరం కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.సురక్షితమైన, చట్టపరమైన అబార్షన్‌కు మహిళలు ఎవరైనా అర్హులేనని..మెడికల్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం.. ఒంటరి, అవివాహిత మహిళలు కూడా అబార్షన్ చేసుకునే హక్కు ఉందని తెలిపింది. కానీ రూల్స్ ప్రకారం 24 నెలల గర్భాన్ని మాత్రమే తొలగించుకునే అవకాశం ఉందని సుప్రీం సూచించింది. వివాహితుల అత్యాచారం విషయంలోనూ ప్రెగ్నెన్సీ యాక్ట్ వర్తిస్తుందని సుస్పష్టం చేసింది. వివాహిత మహిళలు, అవివాహిత మహిళల మధ్య తేడాను చూడడం కృత్రిమం అవుతుందని..అది రాజ్యాంగ వ్యతిరేకం కూడా అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. కేవలం పెళ్లి చేసుకున్న మహిళలు మాత్రమే శృంగారంలో పాల్గొంటారన్న వాదనను కూడా బలపరుస్తుందని కోర్టు ఈ సందర్భంగా వెల్లడించింది.
జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎస్ బొప్పన్న, జేబీ పర్దివాలాలతో కూడిన ధర్మాసనం అబార్షన్ అంశంపై విచారణ చేపట్టగా..అవివాహత మహిళ 20 వారాల తర్వాత గర్భాన్ని తొలగించరాదన్న నియమం సరైంది కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒకవేళ అలా నియంత్రిస్తే..అది రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్‌ను ఉల్లంఘించినట్లే అవుతుందని కోర్టు తెలిపింది. మెడికల్ టర్మినేషనల్‌లోని రూల్ 3బీ(సీ ) కేవలం వివాహిత మహిళలకే వర్తిస్తే..మరి అవివాహితులు సెక్స్ లో పాల్గొనడం లేదన్న అర్థం వస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో వివాహితులు, అవివాహితుల మధ్య కృత్రిమ భేదాన్ని సృష్టించడం సరైందికాదంది.
మైనర్లు బాలికలు..అత్యాచారానికి గురి అయిన బాధితులు గర్భ సమస్యలు ఉన్నవాళ్లు తమ గర్భాన్ని 24 వారాల వరకు టర్మినేట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇష్టపూర్వకంగా శృంగారం పాల్గొన్న వారి కేసుల్లో మాత్రమే ఆ నియమం 20 వారాలు మాత్రమే ఉంది. ఈ తేడా ఉండరాదు అని కోర్టు వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!







