‘ది ఘోస్ట్’ ట్రైలర్ విడుదల...
- September 30, 2022
హైదరాబాద్: కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. స్పై నేపథ్యంలో గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి బరిలో నాగ చైతన్య తో కలిసి ‘బంగార్రాజు’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న నాగ్..ఇప్పుడు ‘ది ఘోస్ట్’ సినిమాతో రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ , టీజర్స్ అంచనాలు రెట్టింపు చేయగా..శుక్రవారం చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
అండర్ వరల్డ్ అంతా ఘోస్ట్ ముందు మోకాళ్ళ మీద నిలబడి దయ చూపమని కోరడంతో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ప్రమాదంలో చిక్కుకున్న సోదరి.. 20 ఏళ్ల తర్వాత తమ్ముడు సహాయం కోరడంతో ఇంటర్ పోల్ ఆఫీసర్ అయిన విక్రమ్ (నాగార్జున) రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తన అక్క మరియు మేన కోడలిని కాపాడుకోడానికి అతను మొత్తం అండర్ వరల్డ్ తో వార్ కు సిద్దమవుతాడని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇన్నేళ్ల తర్వాత గుర్తొచ్చి పిలిచావా అని అడుగుతావా?.. అవసరం కోసం పిలిచావా అని అడుగుతావా?’ , ‘డబ్బు – సక్సెస్ సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది’ వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే దసరా వరకు ఆగాల్సిందే.
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ – పుస్కుర్ రామ్ మోహన్ రావు – శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాని నిరించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







