క్లాస్ రూంలో విద్యార్థుల గొడవ.. విద్యాశాఖ సీరియస్
- September 30, 2022
సౌదీ: జజాన్‌లోని ఒక పబ్లిక్ సెకండరీ పాఠశాలలో తరగతి గదిలో క్లాస్ టీచర్ సమక్షంలోనే ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు విద్యా శాఖ తెలిపింది. మంగళవారం ఒక పబ్లిక్ సెకండరీ పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగిందని, వారిలో ఒకరికి గాయాలయ్యాయని జజాన్ విద్యా శాఖ ప్రతినిధి రాజా అల్-అట్టాస్ ధృవీకరించారు. జజాన్ రీజియన్‌లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెంటనే ఘటనకు గల కారణాలపై విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిందన్నారు. సంఘటన జరిగిన వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించారని, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం విద్యార్థి అదే రోజు ఆస్పత్రి నుంచి ఇంటికి పోయినట్లు అల్-అట్టాస్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







