ఎక్స్‌పో సిటీ దుబాయ్: సందర్శకులను ఆశ్చర్యపరిచేలా 'అవేకనింగ్ ఆఫ్ అల్ వాస్ల్' షో
- September 30, 2022
దుబాయ్: ఎక్స్‌పో సిటీ దుబాయ్ లో భాగంగా సందర్శకులను ఆశ్చర్యపరిచేందుకు ఉచిత 'అవేకనింగ్ ఆఫ్ అల్ వాస్ల్' షో సిద్ధమైంది. ఎక్స్‌పో 2020 దుబాయ్ లో 'అవేకనింగ్ ఆఫ్ అల్ వాస్ల్' షో సాయంత్రం 6.15 గంటలకు (సాయంత్రం ప్రార్థన తర్వాత) ప్రారంభం కానుంది. 360-డిగ్రీల ప్రొజెక్షన్ సందర్శకులకు అద్భుతమైన విజువల్ థ్రిల్లింగ్ లో ముంచెత్తుతుందని అల్ వాస్ల్ షో నిర్వాహకులు తెలిపారు. ప్రపంచంలోని అత్యంత సృజనాత్మక ఆలోచనలతో రూపొందించిన విస్మయం కలిగించే సాంకేతికతలను షోలో భాగంగా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ షో సందర్భంగా సాంస్కృతిక, చారిత్రక అంశాలతోపాటు మానవీయ విలువలను కండ్లకు కట్టేలా ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు స్పష్టం చేశారు. బుధవారం నుండి ఆదివారం వరకు వారంలో ఐదు సాయంత్రాలు 'అవేకనింగ్ ఆఫ్ అల్ వాస్ల్' షో ఉంటుందని, సందర్శకులందరికి ఉచిత ప్రవేశం కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







