పౌరులు, నివాసితులకు ఉచితంగా ఫ్లూ వ్యాక్సిన్: సౌదీ
- September 30, 2022
సౌదీ: పౌరులు, అధిక-ప్రమాద వర్గాల నివాసితులకు ఉచితంగా ఫ్లూ వ్యాక్సిన్‌లను అందజేయనన్నట్లు ఎమిరేట్స్ హెల్త్ సర్వీసెస్ (EHS) ప్రకటించింది.ఈ మేరకు జాతీయ అవగాహన ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. ఇన్‌ఫ్లుయెంజాతో సహా అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి EHS సమగ్ర ప్రణాళిక అమలులో భాగంగా ఫ్రీ వ్యాక్సిన్ క్యాంపెయిన్ ను ప్రారంభించినట్లు ఎమిరేట్స్ హెల్త్ సర్వీసెస్‌లోని పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ షమ్సా లూటా తెలిపారు.యూఏఈ పౌరులు, గర్భిణీ స్త్రీలు, 50 ఏళ్లు పైబడిన వ్యక్తులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, ఆరోగ్య రంగ కార్మికులకు ఉచితంగా వ్యాక్సిన్ అందజేయనున్నట్లు తెలిపారు. మిగతా వారు కనీస రుసుముతో వ్యాక్సిన్ ను పొందవచ్చన్నారు.అన్ని ప్రజారోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ క్లినిక్‌లు, EHS కింద ఉన్న ఆసుపత్రులలో ఈ సదుపాయం అందుబాటులో ఉందని డాక్టర్ షమ్సా లూటా తెలిపారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







