హైదరాబాద్‌లో ట్రాఫిక్ కొత్త రూల్స్..
- September 30, 2022
హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇకపై కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలు కానున్నాయి. అధికారులు ట్రాఫిక్ నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి ఇకపై పోలీసులు భారీ జరిమానాలు విధించబోతున్నారు.
సోమవారం నుంచి ట్రాఫిక్ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం.. సిగ్నల్స్ దగ్గర స్టాప్ లైన్స్ దాటి వాహనదారులు ముందుకొస్తే రూ.100 ఫైన్. అలాగే ఫుట్‌పాత్‌లను దుకాణదారులు ఆక్రమించి, వారికి సంబంధించిన ఏవైనా వస్తువులు పెడితే భారీ జరిమానా విధిస్తారు. అలాగే పాదచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్ చేస్తే రూ.600 జరిమానా ఉంటుంది. వాహనదారులు ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేసి, ఇతర వాహనాలు వెళ్లకుండా చేస్తే రూ.1,000 జరిమానా. తాజా నిబంధనలకు అనుగుణంగా సోమవారం నుంచి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







