FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022.. సౌదీ మ్యాచ్‌కి స్పెషల్ విమాన సర్వీసులు
- September 30, 2022
ఖతార్: FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 సందర్భంగా సౌదీ అరెబియా జట్టు ఆడే మ్యాచుల కోసం దమ్మామ్-దోహా మధ్య మరిన్ని విమాన సర్వీసులను నడుపనున్నట్లు ఖతార్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. సౌదీ అరేబియాలోని ఫుట్‌బాల్ అభిమానులకు తమ జాతీయ జట్టుకు మద్దతు ఇచ్చేందుకు తమ నిర్ణయం దొహదం చేస్తుందని తెలిపింది. శీతాకాలపు షెడ్యూల్‌లో భాగమైన ఐదు రోజువారీ విమానాలతో పాటు, సౌదీ జాతీయ జట్టు ఆడబోయే మ్యాచ్‌ల కోసం మరో ఐదు విమానాలను నడుపనున్నట్లు ఖతార్ ఎయిర్‌లైన్ పేర్కొంది. నవంబర్ 22న సౌదీ అరేబియా వర్సెస్ అర్జెంటీనా మ్యాచ్ ఉండగా.. నవంబర్ 26న పోలాండ్.. నవంబర్ 30న మెక్సికో తో సౌదీ తలపడనుంది. ఫుట్ బాల్ అభిమానులు తమ వెబ్‌సైట్‌లో SAR1,436 ప్రత్యేక ధరతో టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చని ఖతార్ ఎయిర్ లైన్స్ సూచించింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







