అక్టోబర్ 31 నుంచి విజయవాడ-షార్జా మధ్య విమాన సర్వీసులు
- October 01, 2022
విజయవాడ: అక్టోబర్ 31 నుండి షార్జా-విజయవాడ-షార్జా మార్గంలో వారానికి రెండుసార్లు(సోమవారం, శనివారం) విమానాలను నడుపనున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది. తమ వెబ్‌సైట్‌లో టిక్కెట్ బుకింగ్ ను ప్రారంభించినట్లు తెలిపింది. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం.. విమానం షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఉదయం 11 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.25 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6.35 గంటలకు షార్జాకు బయలుదేరుతుంది. టిక్కెట్ ధర ₹12,000 నుండి ప్రారంభమవుతుందని విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఒమన్‌లోని మస్కట్‌కు వారానికి ఒక సర్వీసు(ప్రతి మంగళవారం) నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. షార్జాకు మరో రెండు సర్వీసులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. షార్జా, మస్కట్ లకు నేరుగా విమాన సర్వీసు ఉండటం వల్ల ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాల్లో పని చేసే అనేకమందికి ఇది ఉపయోగపడుతుందన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







