అక్టోబర్ నెలకు పెట్రోల్, డిజీల్ ధరల ప్రకటన. గత నెలతో పోలిస్తే కాస్త తగ్గింపు

- October 01, 2022 , by Maagulf
అక్టోబర్ నెలకు పెట్రోల్, డిజీల్ ధరల ప్రకటన. గత నెలతో పోలిస్తే కాస్త తగ్గింపు

యూఏఈ :  అక్టోబర్ నెలకు సంబంధించి పెట్రోల్, డిజీల్ ధరల రేట్లను ఇంధన కమిటీ ప్రకటించింది. శుక్రవారం సమావేశమైన కమిటీ అధికారులు గత నెలతో పోలిస్తే ధరలను కాస్త తగ్గించాలని నిర్ణయించారు. సూపర్ 98 పెట్రోల్ రేటు సెప్టెంబర్ లో లీటర్ కు 3.41 దిర్హామ్ లు ఉండగా దానిని 3.03 దిర్హామ్ లు చేశారు. స్పెషల్ 95 పెట్రోల్ ధర లీటరుకు 2.92 దిర్హామ్ అయ్యింది.  సెప్టెంబర్‌లో ఇది 3.30 దిర్హామ్ లు గా ఉండేది. ఇక ఈ ప్లస్ 91 పెట్రోల్ ధర లీటరుకు సెప్టెంబర్ లో 3.22 దిర్హామ్ లు ఉండగా ఇప్పుడు 2.85 దిర్హామ్ లు చేశారు.  డీజిల్ సెప్టెంబరులో 3.87 దిర్హామ్ లు ఉంటే దానిని 3.76 దిర్హామ్ కు తగ్గించారు. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com