నిర్మాణ పనుల టైమింగ్స్ మార్చండి-అధికారులకు మున్సిపల్ మంత్రి ఆదేశం
- October 01, 2022
కువైట్: నిర్మాణ పనుల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మంత్రి డాక్టర్. రానా అల్-ఫారెస్ అధికారులను ఆదేశించారు. భవనాల నిర్మాణానికి సంబంధించి పని వేళలు మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భవన నిర్మాణాల కారణంగా వచ్చే ధూళి, దుమ్ము, శబ్దాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రాత్రి వేళ్లలో నిర్మాణ పనులు చేపట్టే అవకాశాన్ని పరిశీలించాలని మున్సిపల్ డైరెక్టర్ జనరల్ ఎం. అహ్మద్ అల్-మన్‌ఫౌహికి సూచించారు. మున్సిపాలిటీ లో కార్మికులకు నిర్దిష్టమైన పని గంటలను కేటాయించాలన్నారు. పని వేేళల్లో మార్పు కారణంగా కార్మికులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలన్నారు. అదే విధంగా శానిటేషన్, అడ్వర్టైజింగ్, ఇన్స్ పెక్షన్ ఇన్‌స్పెక్టర్లు, ఫీల్డ్ లో ఉండే అధికారులకు కూడా అలవెన్స్, ప్రమాదాలకు గురైతే పరిహారానికి సంబంధించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలన్నారు.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







