ఫిఫా వరల్డ్ కప్ కోసం వాలంటీర్లకు మొదలైన శిక్షణ
- October 01, 2022
ఖతార్ : ఫిఫా వరల్డ్ కప్-2022 ఈ సారి ఖతార్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఖతార్ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇక వరల్డ్ కప్ చూసేందుకు వచ్చే విదేశీ అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోర్నమెంట్ సజావుగా సాగేందుకు భారీగా వాలంటీర్లను ఎంపిక చేసింది. వారికి శుక్రవారం నుంచి శిక్షణ ప్రారంభమైంది. లుసైల్ స్టేడియం దాదాపు 20 వేల మంది వాలంటీర్లకు ట్రైనింగ్ మొదలు పెట్టారు. అభిమానుల గైడెన్స్ తో పాటు స్టేడియంలో మ్యాచ్ సజావుగా సాగటం, అభిమానులకు కావాల్సిన సమాచారం అందించటం వంటి సేవలను వాలంటీర్లు అందించనున్నారు. దాదాపు 4,20, 000 మంది వాలంటీర్లు ఉండేందుకు రాగా వీరిలో 20 వేల మందిని తీసుకున్నారు. 160 దేశాలకు సంబంధించిన వాలంటీర్లు ఈ టీమ్ లో ఉన్నారు. ఫిఫా వరల్డ్ కప్ చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి అభిమానులు వస్తారు. వారికి ఆయా దేశాలకు సంబంధించిన వాలంటీర్లు సేవలు అందించనున్నారు. ట్రైనింగ్ లో భాగంగా FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 LLC, వర్క్‌ఫోర్స్ , అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ రాషా అల్ ఖర్నీ మాట్లాడారు. “ఇది మీరు ఓ కొత్త ప్రొఫెషన్ ను ప్రారంభించడం లాంటిదే. ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్ ఇది. వాలంటీర్లు తమ బాధ్యతలను ఎలా చేయాలో సరిగా అర్థం చేసుకోవాలి. అందుకు అవసరమైన శిక్షణ, వసతులను మేము మీకు కల్పిస్తాం. 20 వేల మందిలో ప్రతి వాలంటీర్ మన కుటుంబ సభ్యులుగానే భావించాలి. ఈ ఈవెంట్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించటం మన లక్ష్యం". అని అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







