ఏవండోయ్ నానిగారూ.! మేకోవర్ మరీ ఇంతలానా?
- October 01, 2022
హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. ఎందుకంటారా.? ‘దసరా’ అనే సినిమాలో నాని నటిస్తున్నసంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం నాని డిఫరెంట్ మేకోవర్ ప్రదర్శిస్తున్నాడు.
అక్టోబర్ 3న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందన్న అనౌన్స్మెంట్ సందర్భంగా, ‘దసరా’ చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో నానిని అభిమానులు కూడా గుర్తు పట్టలేకపోతున్నారు. అంతలా మేకోవర్ అయిపోయాడు.
మేకోవర్ విషయంలో ఈ మధ్య హీరోలు అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. చరణ్, అల్లు అర్జున్ తదితర హీరోలు ఈ మధ్య షాకింగ్ లుక్స్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే, నాని మాత్రం ఇంతవరకూ అలాంటి సాహసం చేయలేదు.
కానీ, ఈ సారి నానికి కూడా మేకోవర్ తప్పినట్లు లేదు. ‘దసరా’ మూవీ కోసం మాసిన గెడ్డం. పెరిగిన జుట్టు.. మాస్, పక్కా ఊర మాస్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు నాని. ఈ లుక్‌లో నానిని చూడడం కాస్త కష్టంగానే అనిపిస్తోంది ఇప్పటికయితే.
కానీ, సినిమా కథా, కథనాల ప్రకారం నాని ఈ లుక్స్‌ని మ్యాచ్ చేసేస్తాడేమో చూడాలి మరి. రీసెంట్గా ‘శ్యామ్ సింఘరాయ్’, ‘అంటే సుందరానికి..’ వంటి ఫ్యామిలీ మూవీస్‌తో ఆకట్టుకున్న నాని, ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్తో ఎలాంటి మ్యాజిక్ చేయనున్నాడో చూడాలిక.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







