అంత జాగ్రత్త తీసుకున్నా.. ‘గాడ్ ఫాదర్’కి అపశృతి తప్పలేదుగా.!
- October 01, 2022
హైదరాబాద్: సినిమా ఫంక్షన్లకు వచ్చే అభిమానులను కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. అందుకే తమ అభిమానులకు ముందుగానే హీరోలు హెచ్చరిస్తుంటారు తమ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని తమపై అభిమానాన్ని చూపించాలని.
ఎంత చెప్పినా, అభిమానుల్లో ఎంతో కొంత నిర్లక్ష్యం. పలు మార్లు చూస్తూనే వున్నాం. ఇటీవల జరిగిన ‘గాడ్ ఫాదర్’ సినిమా ఫంక్షన్‌లోనూ చిరంజీవి ఆ హెచ్చరిక చేసినప్పటికీ, అపశృతి జరిగింది. అనంతపురంలో జరిగిన ‘గాడ్ ఫాదర్’ ఈవెంట్‌కి వేలాది మంది అభిమానులు తరలి వచ్చిన సంగతి తెలిసిందే.
భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అభిమానులు చిరంజీవిని చూసేందుకు ఈ వేడుకకు పోటెత్తారు. చిరంజీవి సైతం అభిమానుల ఉత్సాహాన్ని చూసి, జోరు వానలోనూ ఉత్సాహంగా, ఉద్వేగమైన తన స్పీచ్ ఇచ్చి కష్టపడి అక్కడికి వచ్చిన అభిమానుల్ని సంతృప్తి పరిచారు.
అయితే, ఈ ఫంక్షన్‌కి వస్తూ దారిలోనే 22 ఏళ్ల ఓ కుర్రోడు యాక్సిడెంట్‌కి గురయ్యాడు. మరో పది, పదిహేను నిమిషాల్లో సభా ప్రాంగణానికి చేరుకోవల్సిన ఈ కుర్రాడు మృత్యువు ఒడికి చేరుకున్నాడు. అనంతపురం గుత్తి వద్ద జరిగిన యాక్సిడెంట్‌లో రాజశేఖర్ అనే కుర్రాడో మృతి చెందాడు.
గతంలో పలు మార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి రక్తదానం చేశాడు రాజశేఖర్. అలాగే చిరంజీవి పిలుపు మేరకు రాజశేఖర్ కుటుంబ సభ్యులు అతని కళ్లను కూడా దానం చేశారంటే, చిరంజీవిపై ఆ కుర్రాడికి వున్న అభిమానం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ కుర్రాడి కుటుంబ సభ్యలుకు చిరంజీవి కుటుంబం తరపున ఏదైనా సాయం అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అఫ్‌కోర్స్.! చిరంజీవి అలాంటి విషయాల్లో ముందే వుంటాడనుకోండి.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







