రాజమౌళిపై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగాస్టార్.! అలా అనేశారేంటబ్బా.!
- October 01, 2022
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్‌కి గాడ్ ఫాదర్. అందులో నో డౌట్. 150కి పైగా సినిమాలు చేసిన ఆయనకు అపారమైన అభిమానం వుంది ప్రేక్షకుల్లో. ఇటీవల ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా, ‘నన్ను అభిమానించే ప్రతీ అభిమాని నాకు గాడ్ ఫాదరే..’ అని వ్యాఖ్యానించడం విశేషం.
ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు చిరంజీవి. తెలుగుతో పాటూ, హిందీలో కూడా విడుదల కానున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు ‘గాడ్ ఫాదర్’ హిందీ ట్రైలర్ బాలీవుడ్‌లో రిలీజ్ కానుంది.
తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి, జక్కన్న రాజమౌళి గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. రాజమౌళితో చిరంజీవి సినిమా ఎప్పుడు అని అడిగితే.? నో నేను రాజమౌళితో సినిమా చేయను.. అని చిరంజీవి చెప్పారు.
అదేంటీ.? తెలుగు సినిమాని ఇండియన్ సినిమాగా మార్చేసిన గొప్ప దర్శకుడు రాజమౌళి కదా.. ఆయన డైరెక్షన్‌లో చిరంజీవి సినిమా చేయకపోవడమేంటీ.? అనుకుంటున్నారా.? అదే అభిప్రాయం ఆయనకూ వుంది. అయితే, అంత గొప్ప దర్శకుడు కోరుకునే అవుట్ పుట్‌ని నేనివ్వలేనేమో అని చిరంజీవి అన్నారు.
అలాగే, రాజమౌళి తన ఒక్కో సినిమా కోసం నాలుగైదేళ్లు టైమ్ తీసుకుంటారు. నాలుగేళ్లలో నేను నాలుగు సినిమాలు చేసేయాలి.. అందుకే ఆయన డైరెక్షన్‌లో నాకు వర్కవుట్ అవ్వదు అనేశారు చిరంజీవి. అవును అదీ నిజమేగా.!
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







