అల్లు వారబ్బాయ్‌తో పవన్ హీరోయిన్.! మరీ అంత బోల్డ్ గానా.!
- October 01, 2022
హైదరాబాద్: ‘మజ్ను’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్. చాలా తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగిపోయిందన్న భ్రమ కలిగించింది అనూ ఇమ్మాన్యుయేల్. పాపం అందుకు అనూ ఇమ్మాన్యుయేల్ తప్పేం లేదులెండి.
ఆమెకు వచ్చిన అవకాశాలు అలాంటివి మరి. చిన్న సినిమాలతో స్టార్ట్ చేసి, సడెన్‌గా స్టార్ హీరోలతో క్రేజీ ఆఫర్లు దక్కించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘అజ్ఞాతవాసి’, అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకున్న అనూ ఇమ్మాన్యుయేల్ ఇంకేముంది.. స్టార్ హీరోయిన్ హోదా దక్కించేసుకున్నట్లే అనుకున్నారంతా.
కానీ, పాప బ్యాడ్ లక్. ఆ రేంజ్‌లో క్రేజ్ దక్కించుకున్నా, ఆ రెండు సినిమాలూ ఒకదానికి మీద ఒకటి అన్నట్లుగా కోలుకోలేని దెబ్బ కొట్టేశాయ్ అనూకి. దాంతో, ఎంత ఫాస్ట్‌గా ఫామ్‌లోకి వచ్చింది. అంతే ఫాస్ట్‌గా మాయమైపోయింది అనూ ఇమ్మాన్యుయేల్.
ఆ తర్వాత ఒకటీ అరా సినిమాలతో అలా వస్తూ ఇలా మాయమైపోతోంది మెరుపుతీగలా. కాస్త గ్యాప్ తీసుకున్న అనూ మళ్లీ వస్తోంది. ఈ సారి అల్లు హీరో శిరీష్‌తో స్ర్కీన్ షేర్ చేసుకుంటోంది. అల్లు శిరీష్ హీరోగా రూపొందుతోన్న ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. నవంబర్ 4న ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అయ్యింది.
ఈ సినిమా ప్రచార చిత్రాల్లో శిరీష్‌తో అనూ చేస్తున్న కెమిస్ర్టీ వీర లెవల్లో వుంది. గాఢమైన లిప్ లాకులు, బోల్డ్ సన్నివేశాలూ చాలానే వున్నాయ్. అప్పుడు అన్న బన్నీతో అనూకి అస్సలు వర్కవుట్ కాలేదు. ఇప్పుడు తమ్ముడు శిరీష్‌తో అయినా వర్కవుట్ అవుతుందేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







