అద్దె చెల్లించని సూపర్ మార్కెట్ యాజమనిపై కోర్టు సీరియస్. బిల్డింగ్ ఖాళీ చేయాలని ఆదేశం
- October 02, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ లో సూపర్ మార్కెట్ నిర్వహించేందుకు ఓ వ్యక్తి బిల్డింగ్ ను అద్దెకు తీసుకొని 9 నెలలుగా అద్దె చెల్లించటం లేదు. దీంతో బిల్డింగ్ యాజమాని కోర్టును ఆశ్రయించాడు. తనకు బకాయి ఉన్న అద్దె డబ్బుల వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అద్దె అగ్రిమెంట్ కు సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించాడు. నెలకు 1800 దిర్హామ్ లు చొప్పున అగ్రిమెంట్ రాసుకున్నామని కానీ గత 9 నెలలుగా 16, 200 దిర్హామ్ లు కిరాయిదారు బకాయి పడ్డాడని తెలిపాడు. అతను ఇచ్చిన చెక్ లు బౌన్స్ అయ్యాయని కోర్టు వాటి ఆధారాలు సమర్పించాడు. దీంతో కిరాయిదారుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పూర్తి బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. లేదంటే అతని ఆస్తి నుంచి జప్తు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా వెంటనే బిల్డింగ్ ఖాళీ చేయాలని తేల్చిచెప్పింది.
తాజా వార్తలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు







