టెహ్రన్ లో ఓ పోలీస్ స్టేషన్ పై వేర్పాటు వాదుల దాడి. 19 మంది మృతి
- October 02, 2022
టెహ్రాన్: టెహ్రాన్ లోని సౌత్ ఈస్ట్రన్ లో ఓ పోలీస్ స్టేషన్ పై వేర్పాటు వాదులు ఆటాక్ చేశారు. బాంబులతో దాడి చేసిన అనంతరం కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఎలైట్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ నలుగురు సహా మొత్తం 19 మంది చనిపోయారు. నమాజ్ కు వచ్చిన వారిలో కలిసిపోయిన దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బాసిజీ బలగాలతో సహా 32 మంది గార్డ్ లు కూడా గాయపడ్డారు. ఐతే ఈ దాడి వేర్పాటు వాద గ్రూప్ చేసిందేనని ప్రభుత్వం ప్రకటించింది. కానీ హిజాబ్ కు సంబంధించిన పోలీస్ కస్టడీలో 22 ఏళ్ల యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళనల్లో భాగంగా నిరసనకారులు దాడి చేసి ఉంటారా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఐతే విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!







