భారత్ కరోనా అప్డేట్
- October 02, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 3,375 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 37,444 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. దేశంలో రికవరీ రేటు 98.73 శాతంగా ఉందని చెప్పింది. నిన్న కరోనా నుంచి 4,206 మంది కోలుకున్నారని తెలిపింది. ఇప్పటివరకు కరోను నుంచి కోలుకున్న కేసులు 4,40,28,370గా ఉన్నాయని పేర్కొంది.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉన్నట్లు చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.35 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు 218.75 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారని తెలిపింది. వాటిలో రెండో డోసుల సంఖ్య 94.87 కోట్లుగా ఉందని పేర్కొంది. బూస్టర్ డోసుల సంఖ్య 21.39 కోట్లుగా ఉందని తెలిపింది. నిన్న 6,90,194 డోసులు వేశారని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 89.56 కోట్ల కరోనా పరీక్షలు చేశారని తెలిపింది. నిన్న 2,64,127 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







