ఫుట్‌బాల్ గ్రౌండ్లో తొక్కిసలాట..127 మంది మృతి...
- October 02, 2022
ఇండోనేషియా: ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.తూర్పు జావా ప్రావిన్సులోని ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 127 మంది ప్రాణాలు కోల్పోయారు.180 మంది తీవ్రంగా గాయపడ్డారు.అరేమా ఫుట్‌బాల్ క్లబ్-పెర్సెబయ సురబయ మధ్య గతరాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఇండోనేషియా పోలీసులు తెలిపారు.ఓడిపోయిన జట్టు అభిమానులు ఒక్కసారిగా మైదానంలోకి దూసుకురావడంతో ఈ ఘటన జరిగింది.వారిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.ఇది తొక్కిసలాటకు దారితీసింది.
మలాంగ్‌లో జరిగిన ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ అనంతరం అభిమానులు మైదానంలోకి చొచ్చుకెళ్తున్న వీడియోలు, ఫొటోలను స్థానిక మీడియా చానళ్లు ప్రసారం చేశాయి. కాగా, ఈ మ్యాచ్‌లో పెర్సెబయ 3-2తో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగిన తొక్కిసలాటతో ఇండోనేషియాలోని ప్రముఖ లీగ్ అయిన బీఆర్ఐ లీగ్ 1.. వారం రోజులపాటు మ్యాచ్‌లను నిషేధించింది. మరోవైపు, ఈ తొక్కిసలాట ఘటనపై ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండోనేషియా (పీఎస్ఎస్ఐ) విచారణకు ఆదేశించింది. కాగా, ఇండోనేషియాలో ఇలాంటి ఘటనలు ఇటీవల సర్వసాధారణంగా మారిపోయాయి.
తాజా వార్తలు
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!







