వేములవాడలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న టి.గవర్నర్ తమిళిసై
- October 02, 2022
కరీంనగర్: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సామాన్య ప్రజానీకంతో రాజకీయ నేతలు సైతం ఉత్సహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. శనివారం గవర్నర్ తమిళిసై రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా దర్శించుకోవడం, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వెయ్యి సంవత్సరాల చరిత్ర గల పురాతనమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని కాపాడుకోవడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలి… ఆలయ అభివృద్ధి కోసం నా వంతు నేను కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో భాగంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు వేములవాడకు రావడం, వేలాది మంది మహిళలతో ఉత్సవాలలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. బతుకమ్మ పండుగ మొదటి రోజే వేలాది మంది మహిళలతో రాజ్భవన్లో బతుకమ్మ ఆడామని అంటూ రాష్ట్ర ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…







