దుబాయ్ లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
- October 02, 2022
దుబాయ్: దుబాయ్ లో సింగిరి & కో ఆడిట్ ఫర్మ్ లో జాతిపిత,ప్రపంచ శాంతి కమకులు మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ప్రవాసాంధ్రులు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గాంధీ పుట్టిన దేశంలో మనం పుట్టడం ప్రపంచం గర్వించదగ్గ విషయమని.ప్రపంచ దేశాలకు సంగతి మార్గాన్ని చూపిన మహనీయుని పుట్టినరోజు దుబాయ్ లో జరుపుకోవడం భారతీయులుగా గర్వించ దగ్గ విషయమని,కుల మత వర్గ రహితంగా స్వాతంత్ర్యం వైపునకు పరుగులు పెట్టించిన గొప్ప మానవతావాది అని, అయన ప్రతిమాట, ప్రతి అడుగు ఆచరణీయం అని చెప్పారు.దుబాయ్ లో మొదట సారి మహాత్ముని పుట్టినరోజు చేయడం గొప్ప విషయమని నిర్వాహకులు తెలిపారు.అనంతరం మహాత్మా గాంధీ జన్మదిన కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రవాసీయులు డాక్టర్ ముక్కు తులసి కుమార్,సింగిరి రవి కుమార్,కసారం రమేష్,గరగపర్తి రాంకీ, తడివాక రమేష్ నాయుడు,సురేష్ గంధం,కోడి రవికిరణ్,గోపి బర్మా తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!







