జోర్డాన్ రాజు పర్యటన.. స్కూల్స్ మూసివేత
- October 03, 2022
మస్కట్: జోర్డాన్ రాజు పర్యటన కారణంగా మస్కట్లోని పాఠశాలలు మంగళవారం మధ్యాహ్నం తర్వాత మూసివేయనున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం.. సీబ్, బాషర్, ముత్రా, మస్కట్, అమెరత్లోని విలాయత్లలోని పాఠశాలలు మంగళవారం ఉదయం 11.30 గంటలకు మూసివేయనున్నారు. అలాగే మంగళవారం సీబ్, అమెరత్లలో సాయంత్రం పాఠశాలలు పనిచేయవని విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జోర్డాన్ రాజ్యం రాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ఒమన్ సుల్తానేట్ను అధికారిక పర్యటన నిమిత్తం మంగళవారం రానున్నారు. ఆయన రాజ్యంలో రెండు రోజులు ఉండనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







