అధికారిక పత్రాల ఫోర్జరీ.. నిందితులకు జైలుశిక్ష, భారీ జరిమానా
- October 03, 2022
రియాద్: సౌదీ రాయబార కార్యాలయాలలో ఒకదానిలో అధికారిక పత్రాలను ఫోర్జరీ చేసినందుకు నలుగురు పౌరులతో కూడిన క్రిమినల్ గ్యాంగ్ సభ్యులకు కోర్టు జైలుశిక్షతోపాటు భారీ జరిమానా విధించినట్లు పబ్లిక్ ట్రస్ట్ ప్రాసిక్యూషన్ తెలిపింది. నిందితులు ఎంబసీలోని అధికారిక పత్రాలను తయారు చేయడంతోపాటు వాటితో ఇతరుల ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు విదేశాలలో ఉన్న సౌదీ రాయబార కార్యాలయాలలో సమర్పించినట్లు పేర్కొంది. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. అన్ని ఆధారాలను పరిశీలించిన కోర్టు.. నిందితులకు 20 సంవత్సరాల వరకు జైలు శిక్షతోపాటు SR400,000 జరిమానా విధించబడింది. దీంతోపాటు నిందితులు అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఆస్తిని తిరిగి వారి యజమానులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన







