వాట్సాప్‌ ద్వారా వినియోగదారులు ఇప్పుడు మెట్రో టిక్కెట్లను తీసుకోవచ్చు

- October 04, 2022 , by Maagulf
వాట్సాప్‌ ద్వారా వినియోగదారులు ఇప్పుడు మెట్రో టిక్కెట్లను తీసుకోవచ్చు
హైదరాబాద్‌:  భారత ప్రభుత్వ డిజిటల్‌ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా ఉండటంతో పాటుగా హరిత విధానంలో ప్రయాణాలను ప్రోత్సహిస్తూ ఎల్‌ &టీ మెట్రో రైల్‌ (హైదరాబాద్‌) లిమిటెడ్‌  (ఎల్‌ & టీఎంఆర్‌హెచ్‌ఎలల్‌)  ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా  సమగ్రమైన డిజిటల్‌ చెల్లింపు ఆధారిత మెట్రో టిక్కెట్‌ బుకింగ్‌ సేవలను వాట్సాప్‌ ఈ టిక్కెటింగ్‌ సదుపాయంతో ప్రారంభించింది. దీనికోసం తమ డెలివరీ భాగస్వామి , భారతదేశంలో విజయవంతమైన ఫిన్‌టెక్‌ వేదిక బిల్‌ఈజీతో భాగస్వామ్యం చేసుకుంది.
గతకొద్ది నెలలుగా పలు మార్లు పరీక్షలను జరిపిన తరువాత హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఈ నూతన డిజిటల్‌ టిక్కెట్‌ బుకింగ్‌ ను బిల్‌ఈజీ మరియు ఏఎఫ్‌సీ భాగస్వామి షెలిన్‌ఫోగ్లోబ్లాస్గ్‌ సింగపూర్‌తో భాగస్వామ్యం చేసుకుని  వాట్సాప్‌ ద్వారా ప్రారంభించింది. దీనిద్వారా ప్రతి రోజూ మెట్రోలో ప్రయాణించే వారు అత్యంత సౌకర్యవంతంగా ఈ–టిక్కెట్‌ను తమ సొంత  వాట్సాప్‌ నెంబర్‌పై పొందవచ్చు.
 
ఎల్‌ – టీఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఎండీ –సీఈఓ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ ‘‘డిజిటలీకరణ శక్తిని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ నమ్ముతుంది.భారతదేశంలో మొట్టమొదటిసారిగా వాట్సాప్‌ టిక్కెటింగ్‌ సేవలను ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము.ఇది మా ప్రయాణీకులల అనుభవాలను వృద్ధి చేయనుంది’’ అని అన్నారు.
 
బిల్‌ఈజీ ఫౌండర్‌–ఎండీ ఆకాష్‌ దిలీప్‌ పాటిల్‌ మాట్లాడుతూ ‘‘కనెక్టడ్ ఫ్యూచర్‌ కోసం ఎన్‌సీఎంసీ ప్రొటోకాల్స్‌తో పాటుగా సౌకర్యం, సమర్థలతో కూడిన డిజిటల్‌ అనుభవాలను అందించడానికి మా టీమ్‌ కట్టుబడి ఉంది. దేశంలో రవాణా వ్యవస్థను డిజిటలీకరించడానికి మా ప్రయత్నాలను కొనసాగించనున్నాము. వాట్సాప్‌ద్వారా దేశంలో ఆన్‌లైన్‌ టిక్కెట్‌ను మొట్టమొదటిసారిగా హెచ్‌ఎంఆర్‌, బిల్‌ఈజీలు సాధ్యం చేశాయి. బిల్‌ఈజీ క్యుఆర్‌ వినియోగించి ఈ మెట్రో టిక్కెట్లను పొందవచ్చు’’ అని అన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com