FIFA వరల్డ్ కప్.. పాఠశాలలకు కొత్త టైమింగ్స్

- October 06, 2022 , by Maagulf
FIFA వరల్డ్ కప్.. పాఠశాలలకు కొత్త టైమింగ్స్

ఖతార్: FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 సన్నాహాల్లో భాగంగా  నవంబర్ 1 నుండి 17 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు, సిబ్బంది పని వేళల్లో విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ మార్పులు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేయనున్నాయి. అయితే, ప్రైవేట్ నర్సరీలు, వికలాంగుల విద్యా కేంద్రాల సమయాల్లో మార్పులు లేవని, ప్రపంచ కప్‌ సమయంలో అవి అంతకుముందులాగే నడుస్తాయని పేర్కొంది. మొదటి సెమిస్టర్ పరీక్షల వ్యవధి (నవంబర్ 6 నుండి నవంబర్ 17 వరకు) పాఠశాలలు ఉదయం 9 నుండి 11 గంటల వరకు పనిచేస్తాయి. మంత్రివర్గ నిర్ణయం ప్రకారం..  మిడ్ ఇయర్ సెలవులు నవంబర్ 20 నుండి డిసెంబర్ 22, 2022 వరకు ఉంటాయని విద్యాశాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com