కువైట్ లో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం
- October 06, 2022
కువైట్: కువైట్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ నవాఫ్ అల్ సబా ఆధ్వర్యంలో కొత్త మంత్రివర్గం ఏర్పడింది. షేక్ అహ్మద్ కొత్త కేబినెట్ లో గత మంత్రివర్గంలో పనిచేసిన పలువురు మంత్రులు కూడా ఉన్నారు. చమురు, రక్షణ, విద్యుత్ మంత్రిత్వ శాఖలకు కొత్తవారిని నియమించారు. గత ప్రభుత్వంలో మొత్తం 15 మంది మంత్రులు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 12 మందికి తగ్గింది. గత గురువారం జరిగిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో 22 మంది మహిళలతో సహా మొత్తం 305 మంది అభ్యర్థులు ఎన్నికైన విషయం తెలిసిందే.
కొత్త మంత్రివర్గంలో ఉన్నది వీరే
- అంతర్గత వ్యవహారాలు, మొదటి ఉప ప్రధాన మంత్రిగా తలాల్ ఖలీద్ అల్ అహ్మద్ అల్ సబా
- రాష్ట్ర ఉప ప్రధానమంత్రి, క్యాబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి మహ్మద్ అబ్దులతీఫ్ అల్ ఫారెస్
- విదేశాంగ మంత్రి అహ్మద్ నాసర్ అల్ మహ్మద్ అల్ సబా
- మునిసిపల్ వ్యవహారాలు, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ రాణా అబ్దుల్లా అల్ ఫారెస్
- సమాచార, సాంస్కృతిక శాఖ, యువజన వ్యవహారాల సహాయ మంత్రి అబ్దుల్ రెహ్మాన్ బదా అల్ ముతైరి
- ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ అబ్దెల్ వాహబ్ అల్ అవదీ
- చమురు మంత్రి హుస్సేన్ ఇస్మాయిల్ మహమ్మద్ ఇస్మాయిల్
- జాతీయ అసెంబ్లీ వ్యవహారాల సహాయ, గృహ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఖలీఫా థమెర్ అల్ హమిదా
- రక్షణ శాఖ మంత్రి అబ్దుల్లా అలీ అబ్దుల్లా అల్ సలేం అల్ సబా
- పబ్లిక్ వర్క్స్, విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి అమ్మర్ ముహమ్మద్ అల్ అజ్మీ
- విద్యా మంత్రి, ఉన్నత విద్య, శాస్త్రీయ పరిశోధన మంత్రి డాక్టర్ ముత్తన్న తాలిబ్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అల్ రిఫాయ్
- న్యాయ, ఎండోమెంట్స్, ఇస్లామిక్ వ్యవహారాలు, సమగ్రత ప్రమోషన్ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ముహమ్మద్ అబ్దుల్ రహ్మాన్ బుజ్బర్
- సామాజిక వ్యవహారాలు, కమ్యూనిటీ అభివృద్ధి, మహిళలు, బాలల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హుదా అబ్దుల్ మొహసేన్ అల్ షాయ్జీ
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







