ఒమన్‌లో 50 మందికిపైగా చొరబాటుదారులు అరెస్ట్
- October 06, 2022
మస్కట్: 50 మందికిపైగా చొరబాటుదారులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ఒమన్ సుల్తానేట్‌లోకి పెద్ద మొత్తంలో పొగాకును అక్రమంగా తరలించడానికి చేసిన నాలుగు ప్రయత్నాలను విఫలం చేసినట్లు వారు పేర్కొన్నారు. ధోఫర్ గవర్నరేట్‌లోని కోస్ట్ గార్డ్ పోలీసులు.. నాలుగు స్మగ్లింగ్ ప్రయత్నాలను అడ్డుకున్నారన్నారు. ఈ ఘటనలకు సంబంధించి 51 మంది చొరబాటుదారులు, ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో పొగాకును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అరెస్ట్ చేసిన చొరబాటుదారులపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసినట్లు ROP ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







