కొట్టాడు, గట్టిగా కొట్టాడు.! దటీజ్ ‘మెగా’ గాడ్ ఫాదర్.!
- October 06, 2022
మెగా ఫ్యాన్స్‌కి ఈ దసరా అసలు సిసలు పండగలా అభివర్ణించవచ్చు. ఎందుకంటే, దసరా కానుకగా విడుదలైన ‘గాడ్ ఫాదర్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ‘ఆచార్య’ ఇంపాక్ట్ కావచ్చు. మరింకేదైనా కారణం కావచ్చు.. ఈ సినిమాపై చిరంజీవి చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సినిమా చూస్తే అర్ధమవుతుంది.
ఆల్రెడీ తెలిసిన కథే కాబట్టి, కథ గురించి పెద్దగా చెప్పుకోనక్కర్లేదు. కానీ, చిరంజీవి ఇమేజ్‌కీ, ఏజ్‌కీ మ్యాచ్ అయ్యేలా డైరెక్టర్ చేసిన చిన్న చిన్న మార్పులే సినిమాని పెద్ధ హిట్‌గా మలిచాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
కూల్ అండ్ కామ్‌గా సాగిపోయే ఒరిజినల్ వెర్షన్ నుంచి, సోల్ మాత్రమే తీసుకున్నారు. చిరంజీవి గ్రేస్‌ని దృష్టిలో పెట్టుకుని రేసీగా నడిపించిన స్క్రీన్‌ప్లే ఆడియన్స్‌లో గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుంది. క్యారెక్టరైజేషన్ దగ్గర్నుంచీ ప్రొడక్షన్ వేల్యూస్ వరకూ, చిరంజీవి ఏ అంశాన్నీ అంత లైట్‌గా తీసుకోలేదని ‘గాడ్ ఫాదర్’ సీన్ టు సీన్ నిరూపించింది.
‘ఆచార్య’ డిజాస్టర్‌తో చిరంజీవి పని అయిపోయిందంటూ పనికి మాలిన ప్రచారాలకు తెర లేపిన కొందరు యాంటీ మెగా ఫ్యాన్స్‌కి ‘గాడ్ ఫాదర్’ గొడ్డలి పెట్టులాంటి సమాధానమిచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఎలాంటి నెటిటివ్ ప్రచారాలూ ‘గాడ్ ఫాదర్’ సూపర్ హిట్‌ని అడ్డుకోలేకపోయాయ్. దాంతో, ఏడ్చేవాళ్లకు ఏం చేయాలో తెలియక ‘గాడ్ ఫాదర్’ హిట్‌ని ఒప్పుకోలేక, రకరకాల యాంగిల్స్‌లో నెగిటివిటీ ప్రచారాలు షరా మామూలుగానే కొనసాగిస్తున్నారు. బట్ నో వే.! ‘గాడ్ ఫాదర్’ హిట్టు, బంపర్ హిట్ అంతే.!
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







