దర్వాజాత్ అల్-అబ్దుల్ రజాక్ టన్నెల్ మరమ్మతు పనులు ప్రారంభం
- October 07, 2022
కువైట్: దర్వాజాత్ అల్-అబ్దుల్ రజాక్ టన్నెల్ మరమ్మతు పనులను పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ప్రారంభించింది. పబ్లిక్ వర్క్స్ మంత్రి, విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి అలీ అల్-మౌసా మరమ్మతు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా అలీ అల్-మౌసా మాట్లాడుతూ.. తనిఖీ, పరీక్షలు, టన్నెల్ బాడీ కోసం కాంక్రీట్ పనులు, ఇన్సులేషన్ లేయర్లను తొలగించడం, యాంకర్ ప్లాట్‌ఫారమ్‌లను మార్చడం వంటి పనులు పూర్తి కావడానికి 90 రోజులు పట్టవచ్చన్నారు. కువైట్ నగరం నడిబొడ్డున ఉన్న టన్నెల్ సొరంగంలో పగుళ్లు కనిపించడంతో సుమారు రెండు సంవత్సరాల కిందట అధికారులు దీన్ని మూసివేశారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







