రౌడీతో రష్మిక ఎఫైర్: మళ్లీ ఊపందుకున్న ప్రచారం.!
- October 07, 2022
సెన్సేషనల్ స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్న విజయ్ దేవరకొండకీ, నేషనల్ క్రష్‌గా పిలవబడే రష్మిక మండన్నాకి మధ్య ఏదో వుందంటూ గత కొంత కాలంగా రూమర్లు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే.
రౌడీ విజయ్, రష్మిక జంటగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా టైమ్ నుంచే వీరిద్దరి మధ్యా ఎఫైర్ నడుస్తోందంటూ గాసిప్స్ చక్కర్లు కొట్టాయ్.
ఆ తర్వాత ఇదే కాంబినేషన్లో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, ఈ జంట మాత్రం తమ క్రేజ్‌ని కంటిన్యూ చేసింది. కలిసి సినిమాలు చేయకపోయినా, ఈ ఇద్దరూ ఆఫ్ స్ర్కీన్ చాలా క్లోజ్ అనీ, అంతేకాదు, డేటింగ్లో వున్నారంటూ కూడా ప్రచారం వుంది.
కానీ, ఆ ప్రచారాన్ని ఎప్పటికప్పుడే ఈ జంట ఖండిస్తూ వస్తోంది. తాజాగా ఇంకోసారి వీరిద్దరి మధ్యా ఎఫైర్ ప్రచారానికి ఇంకాస్త ఊపందుకుంది. అందుకు కారణం విజయ్‌తో కలిసి రష్మిక మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుండడమే.
‘లైగర్’తో బాగా ఢీలా పడిపోయిన విజయ్ దేవరకొండ, బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా గడిపిన రష్మికా మండన్నా, కాస్త ఛేంజోవర్ కోసం వెకేషన్ ప్లాన్ చేసుకున్నారంతే కానీ, ఈ వెకేషన్ వెరీ క్యాజువల్, ఇందులో పెడార్ధాలు తీయడానికేముంది.? అంటూ రష్మిక, విజయ్ సపోర్టర్లు అభిప్రాయపడుతున్నారు. కానీ, సోషల్ కోడి మాత్రం ఇది అదే..అంటూ క్యూరియాసిటీ వ్యక్తం చేస్తోంది. అఫ్కోర్స్.! దాని పని అదే కదా.!
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







