బోయపాటి-రామ్ యాక్షన్ మొదలెట్టేశారుగా.!

- October 07, 2022 , by Maagulf
బోయపాటి-రామ్ యాక్షన్ మొదలెట్టేశారుగా.!

‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత బోయపాటి శీను యంగ్ హీరో రామ్ పోతినేనిని ఎంగేజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా లేటెస్టుగా రామోజీ ఫిలిం సిటీలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో ఈ సినిమా షూటింగ్ షురూ చేశారు. ‘అఖండ’ సినిమాలోని యాక్షన్ బ్లాక్స్ ధియేటర్లు బద్దలు కొట్టేసిన సంగతి తెలిసిందే. బాలయ్య ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. ఇప్పుడు అదే విధంగా రామ్‌తో తెరకెక్కించబోయే సినిమాలోనూ యాక్షన్ బ్లాక్స్ ప్రత్యేకంగా వుండబోతున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.
ఈ సినిమాలో రామ్‌కి జోడీగా ‘పెళ్లి సందడి’ ఫేమ్ శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, కమర్షియల్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటి శీను నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్.
రామ్ పోతినేని ఇటీవల ‘ది వారియర్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రీతిలో నిలదొక్కుకోలేకపోయింది. అయినా, ఈ సినిమాతో రామ్ పోతినేని ప్యాన్ ఇండియా స్థాయి గుర్తింపు కోసం ప్రయత్నించాడు. ‘ది వారియర్’ సినిమాని తెలుగుతో పాటు తమిళ తదితర భాషల్లో రిలీజ్ చేశారు. అలాగే, తాజా సినిమాని కూడా ప్యాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com