రౌడీతో రష్మిక ఎఫైర్: మళ్లీ ఊపందుకున్న ప్రచారం.!

- October 07, 2022 , by Maagulf
రౌడీతో రష్మిక ఎఫైర్: మళ్లీ ఊపందుకున్న ప్రచారం.!

సెన్సేషనల్ స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్న విజయ్ దేవరకొండకీ, నేషనల్ క్రష్‌గా పిలవబడే రష్మిక మండన్నాకి మధ్య ఏదో వుందంటూ గత కొంత కాలంగా రూమర్లు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. 
రౌడీ విజయ్, రష్మిక జంటగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా టైమ్ నుంచే వీరిద్దరి మధ్యా ఎఫైర్ నడుస్తోందంటూ గాసిప్స్ చక్కర్లు కొట్టాయ్. 
ఆ తర్వాత ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, ఈ జంట మాత్రం తమ క్రేజ్‌ని కంటిన్యూ చేసింది. కలిసి సినిమాలు చేయకపోయినా, ఈ ఇద్దరూ ఆఫ్ స్ర్కీన్ చాలా క్లోజ్ అనీ, అంతేకాదు, డేటింగ్‌లో వున్నారంటూ కూడా ప్రచారం వుంది.
కానీ, ఆ ప్రచారాన్ని ఎప్పటికప్పుడే ఈ జంట ఖండిస్తూ వస్తోంది. తాజాగా ఇంకోసారి వీరిద్దరి మధ్యా ఎఫైర్ ప్రచారానికి ఇంకాస్త ఊపందుకుంది. అందుకు కారణం విజయ్‌తో కలిసి రష్మిక మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుండడమే.
‘లైగర్’తో బాగా ఢీలా పడిపోయిన విజయ్ దేవరకొండ, బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా గడిపిన రష్మికా మండన్నా, కాస్త ఛేంజోవర్ కోసం వెకేషన్ ప్లాన్ చేసుకున్నారంతే కానీ, ఈ వెకేషన్ వెరీ క్యాజువల్, ఇందులో పెడార్ధాలు తీయడానికేముంది.? అంటూ రష్మిక, విజయ్ సపోర్టర్లు అభిప్రాయపడుతున్నారు. కానీ, సోషల్ కోడి మాత్రం ఇది అదే..అంటూ క్యూరియాసిటీ వ్యక్తం చేస్తోంది. అఫ్‌కోర్స్.! దాని పని అదే కదా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com