దుబాయ్: మూడు వారాలపాటు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు
- October 09, 2022
దుబాయ్: అల్ ఖుద్రా రోడ్‌లో నిర్వహించనున్న అభివృద్ధి పనుల్లో భాగంగా మూడు వారాల పాటు ట్రాఫిక్ మళ్లింపును చేపట్టనున్నట్లు దుబాయ్‌లోని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. ఈ మేరకు RTA తన అధికారిక హ్యాండిల్‌లో ఒక ట్వీట్‌లో వెల్లడించింది. రెండు దిశలలో మూడు లేన్‌లను.. అరేబియన్ రాంచ్‌లు, స్టూడియో సిటీ ప్రవేశాలు, నిష్క్రమణలను నిర్వహించేటప్పుడు రహదారిపై ఉన్న రౌండ్‌అబౌట్‌లను తొలగిస్తామని తెలిపింది. వాహనదారులు ముందుగానే బయలుదేరాలని, రోడ్లపై వాహనాన్ని జాగ్రత్తగా నడపాలని అధికార యంత్రాంగం కోరింది. డైవర్లు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవడానికి డైరెక్షనల్ సైనేజ్‌లను అనుసరించాలని సూచించింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







