తెలుగుదేశం-ఖతార్ కార్యవర్గ సభ్యుల సమావేశం

- October 09, 2022 , by Maagulf
తెలుగుదేశం-ఖతార్ కార్యవర్గ సభ్యుల సమావేశం

దోహా: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తీవ్రపరిణామాలపై విశ్లేషిస్తూ వాటిపై తమ స్పందనని, సలహా సూచనలను పంచుకోడానికి మరియు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కావలసిన కార్యాచరణ ప్రణాళికను చర్చించి దాని అమలుకు కావలసిన అంశాలను పరిగణలోకి తెచ్చేందుకు తెలుగుదేశం-ఖతార్ కార్యవర్గం ఈరోజు సభ్యులు అందరితో సమావేశం నిర్బహించడం జరిగింది.

ఈ సమావేశంలో పలువురు సభ్యులు (శాంతయ్య ఎలమంచిలి,వెంకప్ప భాగవతుల , రవి పొనుగుమాటి, రమేష్ దాసరి,సంతోష్ సింగరాజు, మునిస్వామి నాయుడు, అనిల్ మలసాని,రవీంద్ర మొగులూరి, లక్ష్మి ప్రసాద్ బొల్లినేని , శేష సాయి రావుల , నాగభూషణం నర్రా, విక్రమ్ సుఖవాసి ) ప్రసంగించారు.ముఖ్యంగా అమరావతి రైతుల పాదయాత్రకి ఏవిధంగా చేయూత అందచేయాలి,హెల్త్ వర్సిటీకి అన్న ఎన్టీఆర్ పేరు తొలగించటంపట్ల నిరసనని, ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక  నిర్ణయాలు మరియు అనుసరించాలసిన వ్యూహాలు మొదలగు  విషయాలపై తమ స్పందనని తెలియజేసి సలహాలను సూచించారు.అలాగే పార్టీ, కార్యకర్తలు, సామాన్య ప్రజలు పై  వై.సి.పి శ్రేణులదాడులు, ఎదురుకొంటున్న సమస్యలపై కూడా తమ స్పందనని పంచుకున్నారు.అలాగే వై సి పి తప్పుడు ప్రచారాలను ఏ విధంగా తిప్పికొట్టాలి అందుకు అనుసరించాల్సిన వ్యూహాలు కూడా తెలియజేసారు.  
 
తెలుగుదేశం-ఖతార్ అధ్యక్షులు గొట్టిపాటి రమణ మాట్లాడుతూ పార్టీ క్రియాశీలక సభ్యుల సభ్యత్వం పెంచడానికి ప్రతి సభ్యుడు తన వంతు కృషిగ నూతన సభ్యత్వాలను పెంచేలా కృషిచెయ్యాలని, పార్టీని ప్రతిష్ట పరచడానికి కావలసిన ఆర్థికసాయం సమకూర్చడానికి తగు సూచనలను, 2024 లో పార్టీని అధికారంలోకి తీసుకొనిరావడానికి ప్రణాళిక బద్దంగా చేయవలసిన మార్పులను, అనుసరించాలసిన వ్యూహాలు విధానాలను సూచించారు.వై సి పి దాడుల్లో గాయపడిన తెలుగుదేశం కార్యకర్తలు వైద్య సహాయం అందిస్తున్నట్టు తెలియచేసారు, అలాగే అన్న కాంటీన్ కి తెలుగుదేశం-ఖతార్ సభ్యులు అందిస్తున్న సహకారాన్ని కొనియాడారు.

హాజరైన సభ్యులందరు రుచికరమైన భోజనం ఆస్వాదించారు.ఈ కార్యక్రమానికి విజయ్ భాస్కర్ దండ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com