నైట్‌క్లబ్‌లో పరిచయమైన వ్యక్తిని దోచుకున్న మహిళకు జైలుశిక్ష
- October 09, 2022
దుబాయ్: నైట్‌క్లబ్‌లో పరిచయమైన అమెరికన్ వ్యక్తి నుంచి 1,000 దిర్హామ్ నగదు, 8,000 దిర్హామ్ విలువైన బంగారు గొలుసును దొంగిలించినందుకు ఒక ఆఫ్రికన్ మహిళకు మూడు నెలల జైలు శిక్ష పడింది. దొంగిలించిన గొలుసును ప్రియుడికి అప్పగించిన మహిళ.. ఆ తర్వాత దానిని కరిగించి దుబాయ్‌లోని బంగారం మార్కెట్లో విక్రయించేందుకు ప్రయత్నించింది. ఈ కేసు గత జూలైలో జరిగింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. బాధిత అమెరికన్ ఒక నైట్‌క్లబ్‌లో ఆ మహిళను కలుసుకున్నాడని.. అనంతరం ఆమెను తన ఫ్లాట్ కి ఆహ్వానించాడు. మరుసటి రోజు ఉదయం అతను మేల్కొనే సమయానికి ఆఫ్రికన్ మహిళ వెళ్లిపోయింది. తర్వాత తన ఫ్లాట్ లో నగదు, బంగారు గొలుసు మాయమైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అదే సమయంలో ఒక ఆఫ్రికన్ వ్యక్తి కరిగించిన బంగారాన్ని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నాడని పోలీసు ఆపరేషన్స్ గదికి సమాచారం రావడంతో పోలీసుల అలర్ట్ అయ్యారు. అతడిని అరెస్టు చేసి విచారించగా.. తన స్నేహితురాలు తనకు ఇచ్చిందని పోలీసులకు చెప్పాడు. వెంటనే ఆమెను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







