కాబా కిస్వాలో వినియోగించిన 410 కిలోల కాటన్
- October 09, 2022
సౌదీ: కాబా కిస్వా (కాబాను కప్పి ఉంచే నల్లటి గుడ్డ)లో 410 కిలోగ్రాముల కాటన్ ను ఉపయోగించారు. కిస్వా మొత్తం బరువు 1,300 కిలోగ్రాములని రాజు అబ్దుల్ అజీజ్ వ్యవహారాల అండర్ సెక్రటరీ జనరల్ అమ్జాద్ బిన్ అయెద్ అల్-హజ్మీ తెలిపారు. అక్టోబర్ 7న జరిగిన ప్రపంచ పత్తి దినోత్సవంలో అల్-హజ్మీ పాల్గొని మాట్లాడారు. కాబా కిస్వా తయారీకి పత్తిని ముఖ్యమైన, అవసరమైన ముడిసరుకుగా పరిగణిస్తారన్నారు. కిస్వాలో ఉపయోగించే పత్తిని కింగ్ అబ్దుల్ అజీజ్ కాంప్లెక్స్‌లోని పవిత్ర కాబా కిస్వా కోసం అత్యాధునిక నేత యంత్రాల ద్వారా నేస్తున్నారని, కిస్వా వస్త్రానికి లైనింగ్‌గా పత్తిని ఉపయోగిస్తున్నారని వివరించారు. కాబా కిస్వాలో ఉపయోగించే ఖురాన్‌లోని పవిత్ర వాక్యాల ఎంబ్రాయిడరీ అక్షరాలను హైలైట్ చేయడానికి కిస్వా పూతపూసిన ముక్కల తయారీలో పత్తిని ఉపయోగిస్తారని అల్-హజ్మీ చెప్పారు. చల్లటి లేదా వేడిగా ఉండే అన్ని వాతావరణాలకు అనుగుణంగా ఉండే ఉత్తమ రకాల్లో పత్తి ఒకటని పర్యావరణ, వ్యవసాయ పరిశోధకుడు నాజర్ అల్-షాద్వి తెలిపారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







