కువైట్ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న 90,910 మంది ప్రవాసులు
- October 10, 2022
కువైట్ సిటీ: గత జూన్ చివరి నాటికి ప్రభుత్వ రంగంలో దాదాపు 457,140 మంది పౌరులు, నివాసితులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 90,910 మంది ప్రవాసులు ఉన్నారు. మొత్తం కార్మికులలో వీరి సంఖ్య 19.8 శాతం కావడం విశేషం. కార్మికుల్లో 80% కంటే ఎక్కువగా పౌరుల సంఖ్య ఉందని సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక స్పష్టం చేసింది. అధికారిక గణాంకాల ప్రకారం.. ఇదే కాలంలో 1,454 మంది పురుషులు, మహిళలు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను విడిచిపెట్టారు. వీరితో పోలిస్తే 9,786 మంది ఇతర రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, అనుబంధ స్వతంత్ర సంస్థల్లో మొదటి 6 నెలల్లో ఉద్యోగాలు వదిలేశారు. ఇదే సమయంలో 17 మంత్రిత్వ శాఖలలో జనవరి నుండి జూన్ చివరి వరకు 8,332 మంది పురుషులు, మహిళా పౌరులు కొత్తగా ఉద్యోగంలో చేరారు. అలాగే 1408 మంది పురుషులు, మహిళా ప్రవాసులు 16 ప్రభుత్వ విభాగాలలో చేరారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







